CM Revanth | ప్రధాని మోదీపై మండిపడ్డ సీఎం రేవంత్​

CM Revanth | ప్రధాని మోదీపై మండిపడ్డ సీఎం రేవంత్​
CM Revanth | ప్రధాని మోదీపై మండిపడ్డ సీఎం రేవంత్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)పై సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్​(Ahmadabad)లో జరుగుతున్న ఏఐసీసీ(AICC) సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు.

Advertisement

CM Revanth | దేశమంతా కులగణన చేపట్టాలి

రాహుల్​ గాంధీకి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన(Caste Census) చేపట్టామని రేవంత్​రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశమంతా కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  JDU leader | రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జేడీయూ నేత సెటైర్