అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLC KAVITHA | సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ఫీవర్ పట్టుకుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫాలు ఇచ్చామని.. ప్రస్తుత రేవంత్ సర్కారు వాటిని విస్మరించడం బాధాకరమన్నారు.
MLC KAVITHA | సీఎం మాటలు పద్ధతిగా లేవు..
సీఎం రేవంత్‌రెడ్డి మాటలు పద్ధతిగా లేవని ఎమ్మెల్సీ అన్నారు. రేవంత్‌వి గౌరవనీయ స్థానంలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలు కావన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు ఒక హిస్టరీ ఉందని.. రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో అసలు పోలికే లేదన్నారు. గౌరవం, అభిమానం కొంటే వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే గంగాజమున తహజీవ్ అని అభివర్ణించారు. ఇచ్చిన హామీలను పూర్తి చేయని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ మేయర్ నీతూ కిరణ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.