అక్షరటుడే, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ సందర్భంగా జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా బోధన్ మార్కెట్ కమిటీలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి తన సహచర మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడారు. ఇందులో భాగంగా రవి అనే రైతుతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసినందుకు అంకాపూర్ చికెన్ తినిపిస్తవా అని సరదాగా అడిగారు. దీంతో సదరు రైతు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. వైఎస్ మాదిరి రైతుల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, రైతుల మేలు కోరే ప్రభుత్వానికి ఎప్పటికీ ఢోకా ఉండదని రైతు రవి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, అధికారులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.
అంకాపూర్ చికెన్ రుచి చూపిస్తవా..!
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement