CM Revanth Reddy : అతడికి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్ చేసిన రేవంత్

CM Revanth Reddy : అతడికి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్ చేసిన రేవంత్
CM Revanth Reddy : అతడికి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్ చేసిన రేవంత్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌: CM Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో ఐదు స్థానాలకు త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక్క సీటు మాత్రం బీఆర్ఎస్‌కి కన్ఫమ్ అనే చెప్పాలి. ఇక మిగిలిన నాలుగు సీట్లలో సీపీఐకి ఒక్క టికెట్ ఇవ్వనుంది కాంగ్రెస్.

మిగిలిన మూడు టికెట్లను ఎవరికి ఇవ్వాలా అనే కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అన్ని రకాలుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఆప్తుడు అయిన కుసుమ కుమార్ కు సీటు ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మరో రెండు స్థానాలను కూడా ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

CM Revanth Reddy : రేవంత్ దే తుది నిర్ణయం

ఈ మూడు సీట్ల ఎంపికలో తుది నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళో రేపో అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. 10వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కావడంతో అధికారికంగా అభ్యర్థులను ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దాయకర్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Cabinet | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారు. చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా.. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన కుసుమ కుమార్ పేరు అయితే ఫిక్స్ అని అంటున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కూడా మద్దతు పలకడంతో ఆయన సీటు కన్ఫమ్ అని, ఇక మిగిలిన రెండు సీట్లను సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకొని కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement