ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ః CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన బీజీబిజీగా సాగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించినట్లుగా స‌మాచారం.

CM REVANTH REDDY : బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని విన‌తి..

ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరినట్లుగా తెలిసింది. మంగ‌ళ‌వారం సాయంత్రం సీఎం రేవంత్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో ఆయ‌న చర్చించనున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్​

CM REVANTH REDDY : మూసిన‌ది ప్ర‌క్షాళ‌నపై..

అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్-2, రిజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆయ‌న విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నున్నారు. PM గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయ‌నున్నారు. అనంతరం సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులపై వారితో సుదీర్ఘంగా చర్చించనట్లుగా తెలుస్తోంది.

Advertisement