అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మంత్రివర్గంలో ఎవరుండాలో వద్దో.. హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చేశారు. తాను ఇప్పటివరకు ఎవరినీ రికమండ్ చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని.. ఎవరిని కూడా అర్జెంట్‌గా జైల్లో వేయాలనే ఆలోచన ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.
Advertisement
Advertisement