అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని పథకాలకు వర్తించే విధంగా డిజిటల్ ఫ్యామిలి కార్డు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ కార్డును రూపొందించామని సీఎం తెలిపారు. ఈ డిజిటల్ కార్డులో మహిళలనే ఇంటి పెద్దగా చేర్చడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అందిస్తామన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, మహాలక్ష్మి స్కీమ్, ఇందిరమ్మ ఇల్లు ఇలా అన్ని కూడా ఇదే కార్డుపై తీసుకోవచ్చన్నారు.