అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలనే గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శించి.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్‌ డైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల మృతిపై మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. ప్రతినెలా 10వ తేదీలోపు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా అన్ని విద్యాసంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌ భోజనం చేశారు.