అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకువచ్చామని సీఎం రేవంత్​ రెడ్డి(CM REVANTH REDDY) తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మాదాపూర్​లో హెచ్​సీఎల్​ టెక్(HCL TEC)​ కేఆర్​సీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెక్​ కంపెనీల ఏర్పాటు కోసం సులభతరంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో హెచ్​సీఎల్​ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement

దావోస్​లో ఒప్పందాల ప్రకారమే..

దావోస్​లో ఇటీవల జరిగిన ఒప్పందాల ప్రకారమే కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం తెలిపారు. ఇటీవల అమ్జెన్​ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని.. కార్యాలయాన్ని హైదరాబాద్​లో ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు. 60 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్​సీఎల్​ కంపెనీ హైదరాబాద్​లో మరో కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్​బాబు, హెచ్​సీఎల్​ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  sports hub | స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ : పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్ గౌడ్​

Advertisement