అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలీస్ స్కూల్(POLICE SCHOOL)ను సైనిక్ స్కూల్‌లాగా దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTH REDDY) సూచించారు. శనివారం తెలంగాణ పోలీస్(TELANGANA POLICE) కుటుంబాల పిల్లల కోసం చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించిన వెబ్‌సైట్ https://yipschool.in ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు.
స్కూల్ యూనిఫామ్స్ పరిశీలన
2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు ఇతర అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. సైనిక్ స్కూల్(SAINIK SCHOOL) తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
కొత్త ఒరవడిని అవలంభించాలి..
విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీవీ ఆనంద్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21న సీఎం భూమి పూజ చేసిన విషయం విదితమే.
