అక్షరటుడే, వెబ్డెస్క్ :CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ఆ దేశంలో ఎనిమిది రోజుల పాటు పర్యటించనున్నారు. కాగా మంగళవారం సీఎల్పీ భేటీ(CLP Meeting) జరగనుంది. మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జపాన్(Japan) పర్యటనకు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు జపాన్ వెళ్లనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో(Industrial Expo) వీరు పాల్గొంటారు. పెట్టుబడులపై టోక్యో(Tokyo)లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై సీఎం చర్చించనున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ(Skill University) కోసం జపాన్ టెక్నాలజీ అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా అక్కడి పారిశ్రామిక వేత్తలను సీఎం(CM) కోరనున్నారు.