CM Revanth : సీఎం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వనపర్తి పర్యటనలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి పనులు ప్రారంభించడానికి పట్టణానికి వచ్చిన ఆయన తన చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపారు. రేవంత్​రెడ్డి పాఠశాల నుంచి జూనియర్​ కాలేజీ పూర్తయ్యే వరకు వనపర్తిలోనే చదివారు.

CM Revanth : ఆత్మీయ కార్యక్రమం

సీఎం వనపర్తికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన మిత్రులు ఆత్మీయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేవంత్​రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని తన చిన్ననాటి మిత్రులు, తనకు పాఠాలు చెప్పిన గురువులను కలిశారు. తాను చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Raja Singh | బీజేపీ అధికారంలోకి రావాలంటే.. పాత సామాన్​ బయటకు పోవాలి..

CM Revanth : వారికి సర్​ప్రైజ్​ ఇచ్చిన రేవంత్​రెడ్డి

వనపర్తి పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి ఓ కుటుంబానికి సర్​ప్రైజ్​ ఇచ్చారు. తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు. వారితో కొద్దిసేపు గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Advertisement