అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించారు. వనపర్తి పర్యటన ముగించుకొని ఆయన నేరుగా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. టన్నెల్‌లో మట్టి కూలిన ఘటనలో 8 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
CM Revanth : కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ(SLBC) సొరంగం పనులు చేపడుతుండగా మట్టి కూలీ ఎనిమిది అందులో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఎనిమిది మంది కూడా సజీవ సమాధి అయినట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. వీరిలో ఏడుగురు కార్మికులు, ఒక ఇంజినీర్ ఉన్నారు. ఇప్పటికే నలుగురు మృతదేహాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.
CM Revanth : మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో తవ్వకాలు
మృతదేహాలు ఉన్న ప్రాంతాలను జీపీఆర్ మార్కింగ్ ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మృతదేహాలను వెలికితీయలేదు. మృతదేహాలను వెలికి తీయగానే పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీని కోసం సొరంగం వద్ద ఫోరెన్సిక్, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి.