అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న వేములవాడలో పర్యటించనున్నారు. రాజన్న దర్శనం చేసుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, ఇరిగేషన్‌కు సంబంధించిన పనులను ఆయన ప్రారంభించనున్నారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేయనున్నారు. సీఎం సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.