అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందామని సీఎం రేవంత్‌ అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామకపత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా మూసీ పరివాహక ప్రజలు మురికికూపంలో ఉండాలా? అని ప్రశ్నించారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి