అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ రికగ్నైస్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం హైదరాబాద్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం స్పోక్స్ పర్సన్ జయసింహ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. అధ్యక్షుడు మధుసూధన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, సలహాదారు శేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, కన్వీనర్ రమణ రావు పాల్గొన్నారు.