అక్షరటుడే, హైదరాబాద్: Dia Mirza : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) చేసిన ఆరోపణలపై ప్రముఖ నటి, పర్యావరణ కార్యకర్త దియా మిర్జా(Famous actress and environmental activist Dia Mirza has) ఘాటుగా స్పందించారు. ఇటీవల గచ్చిబౌలిలోని కంచాలో చెట్ల తొలగింపుపై విద్యార్థుల నిరసనఉ మద్దతుగా దియా మిర్జా కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్టు చేశారు. ఇవి నకిలీవని, AI ద్వారా రూపొందించారని సీఎం ఆరోపించారు.
దీనిపై దియా మిర్జా X (ట్విటర్) వేదికగా స్పందించారు. “కంచ గచ్చిబౌలిలో జరిగిన కొన్ని విషయాలపై తెలంగాణ సీఎం ఆరోపణలు చేశారు. వాటిలో ఒకటి – నేను FAKE, AI ద్వారా రూపొందించిన చిత్రాలు/వీడియోలను షేర్ చేశానని. ఇది అబద్దం. నేను AI తయారు చేసిన ఫొటో కానీ, వీడియో కానీ పోస్ట్ చేయలేదు.” అని రాసుకొచ్చారు. నిజనిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు.