CM Revanth | జపాన్​కు సీఎం రేవంత్​ బృందం

CM Revanth | జపాన్​కు సీఎం రేవంత్​ బృందం
CM Revanth | జపాన్​కు సీఎం రేవంత్​ బృందం

అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడలు ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్(revanth Japan tour) పర్యటన చేపట్టారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు వీరి పర్యటన ఉంటుంది. సీఎం వెంట ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రెటరీ శేషాద్రి తదితరులు వెళ్లనున్నారు.

Advertisement
Advertisement

జపాన్​లోని టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా (Tokyo, Mount Fuji, Osaka, Hiroshima) తదితర నగరాల్లో సీఎం బృందం పర్యటన సాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన ఉండనుంది. పర్యటనలో పలు సంస్థలతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం చర్చించనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ‘ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో -2025’ (Osaka World Expo-2025) లో తెలంగాణ పెవీలియన్‌(Telangana pavilion)ను ప్రారంభించనున్నారు.

Advertisement