DK Aruna | ఎంపీ డీకే అరుణకు సీఎం ఫోన్​.. ఎందుకంటే?
DK Aruna | ఎంపీ డీకే అరుణకు సీఎం ఫోన్​.. ఎందుకంటే?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DK Aruna | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో సీఎం రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఫోన్​లో మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఇటీవల ఓ ఆగంతకుడు చొరబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై సీఎం ఆమెకు ఫోన్​ చేసి ఆరా తీశారు. ఘ‌ట‌న జ‌రిగిన తీరును, త‌న అనుమానాల‌ను ఎంపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భ‌ద్ర‌త పెంచుతామ‌ని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ మేరకు పోలీసు(Police) శాఖ‌కు ఆదేశాలు జారీ చేశారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచార‌ణ వేగ‌వంతం చేసి వాస్త‌వాలు తేల్చాల‌ని ఆదేశించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | బీఆర్​ఎస్​ నేతలపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం