అక్షరటుడే, వెబ్ డెస్క్ Nothing Phone CMF 1 : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. కూలీ పనికి వెళ్లే వారు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని వారికి కావల్సిన విషయాలు తెలుసుకుంటున్నారు.
అయితే కొందరు ఫోన్ కొనాలని అనుకుంటున్నా, ఆ ధరలకి భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. భారత మార్కెట్లోకి నథింగ్ CMF ఫోన్ 2 (Nothing Phone CMF 2) మోడల్ అతి త్వరలో రానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 28న ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ CMF ఫోన్ 2 లాంచ్ కన్నా ముందే వినియోగదారులు నథింగ్ CMF ఫోన్ 1 (Nothing Phone CMF 1) కొనుగోలుపై భారీగా మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
Nothing Phone CMF 1 : బెస్ట్ ఆప్షన్..
బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపులతో కొనుగోలుదారులు ఈ ఫోన్ కొనుగోలుపై దాదాపు రూ. 5వేలు ఆదా చేసుకునే అవకాశం ఉంది. దేశంలో రూ. 14,999 ధరకు లభించే ఈ (Start phone) స్మార్ట్‌ఫోన్.. కస్టమైజడ్ ఆప్షన్లు, అనేక అదనపు అప్లియన్సెస్ విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది.ఇది రూ. 15వేల కన్నా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫోన్ అని చెప్పవచ్చు.
కస్టమర్లు ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లతో సహా దాదాపు రూ.12,500 ధరకు ఈ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీరు కొత్త స్టైలిష్ (Start phone) స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. అమెజాన్‌లో CMF ఫోన్ 1 డీల్ అసలు మిస్ చేసుకోకండి. ప్రస్తుతం అమెజాన్‌లో CMF ఫోన్ 1 లాంచ్ ధర రూ.14,999 నుంచి రూ.13,980కి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.12,500 కన్నా తక్కువకు తగ్గుతుంది. కొనుగోలుదారులు నెలకు రూ.678 EMI బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు తమ పాత ఫోన్ (Start phone) కూడా ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. దాదారూ. 13,250 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. సీఎంఎఫ్ ఫోన్ 1 6.67-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 2వేల నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌తో మాలి జీపీయూతో పనిచేస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, ఈ సీఎంఎఫ్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 16MP ఉంటుంది.