అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి సీనియర్ ఆర్చరీ టోర్నీకి గూపన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని శీర్షిక ఎంపికైనట్లు కోచ్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో క్రీడాకారిణి సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శకుంతల దేవి, కార్పొరేటర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు లింగన్న, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.