అక్షరటుడే, కామారెడ్డి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాలకు చెందిన 67 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, అధికారులు, పాల్గొన్నారు.