అక్షరటుడే, బాన్సువాడ: పదో తరగతిలో వందశాతం ఫలితాలు వచ్చేలా పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బాన్సువాడలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గతేడాది ఫలితాల్లో 75శాతం ఫలితాలు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్ధినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మాతాశిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కల్కి చెరువు, ఉద్యానవనాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, తహసిల్దార్ వరప్రసాద్, ఎంఈవో నాగేశ్వరరావు, ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డీఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.