అక్షరటుడే, కామారెడ్డి : టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశామని, 8268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు 14న శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి. విక్టర్, అదనపు ఎస్పీ నర్సింహ రెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్ రావు, రీజనల్ కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, డీఎంహెచ్ వో చంద్రశేఖర్, జడ్పీ సీఈవో చందర్, డీఈవో రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.