అక్షరటుడే, కామారెడ్డి: కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతంలో జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందన్నారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల హాజరు విషయంలో సబ్ కలెక్టర్, ఆర్డీవోల సహకారం తీసుకోవాలని సూచించారు.