అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును సీసీ టీవీలో తనిఖీ చేశారు. భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, కామారెడ్డి తహశీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్లు అనిల్, ఇందిర పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement