అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలిపేలా ఆయా శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాటు ఉండాలన్నారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో రాజారాం, డీఆర్డీవో సురేందర్, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్, డీపీవో శ్రీనివాసరావు, డీఏవో భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.