అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నెంబర్ 44 పక్కన గల సర్వే నెంబర్ 527లో ఒక ఎకరం భూమి కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, డీపీఎం రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.