Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్లోని రూం నెంబర్ 25లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Advertisement