అక్షరటుడే, భిక్కనూరు : ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించే విధంగా విద్యార్థులకు బోధన చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. శనివారం భిక్కనూరు కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతిపై ప్రత్యేక అధికారిణి హరిప్రియను అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ రిజిస్టర్‌, హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ శ్రద్ధతో చదివి ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్‌ పొందే విధంగా ర్యాంకులు సాధించాలన్నారు. ఆర్డీవో రంగనాథ్‌ రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, డీఈవో రాజు, జిల్లా పరిషత్‌ సీఈవో చందర్‌ నాయక్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.­­