అక్షరటుడే, కామారెడ్డి: సమాజానికి విద్యార్థులే దిక్సూచి అని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీ, సైబర్‌, ఉమెన్‌ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, సోషల్‌ మీడియా అంశాలపై పబ్లిక్‌ సేఫ్టీ అంబాసిడర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల మాటలకు విలువెక్కువని, అందుకే వారిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా మార్చామన్నారు. కళాశాలల్లో ఏర్పాటు చేసే క్లబ్‌లు పలు అంశాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్‌ రావు, కళాశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.