అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పాఠశాల స్థాయి నుంచే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ కు అవగాహన, క్విజ్ పోటీలను శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ అంబాసిడర్లను నియమించామని తెలిపారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాలు చేసినవారికి కొత్త చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. జిల్లాలో 61 పాఠశాలల్లో 122 మంది విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని వారికి సూచించారు. జిల్లా విద్యా శాఖాధికారి రాజు, డీఎస్పీ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.