అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఎల్ఆర్ఎస్ సర్వేను పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్‌లో సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా భూములను పరిశీలించాలని ఆదేశించారు. వివరాలను సర్వే యాప్ లో పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.