అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌ : వైద్యాధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. శనివారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. ఉదయం 9-45 గంటలకు కూడా పలువురు వైద్యులు ఆస్పత్రి విధులకు హాజరు కాకపోవడంపై ఆయన ఆగహ్రం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌ రావు, తహశీల్దార్‌ జనార్దన్ ఉన్నారు.