అక్షరటుడే, కామారెడ్డి: రైతు రుణమాఫీ రెండో విడత నిధులను జూలై 30న ఉదయం 11 గంటలకు ప్రభుత్వం విడుదల చేయనుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు, బ్యాంక్ అధికారులు, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.