అక్షరటుడే, కామారెడ్డి: స్త్రీనిధి రుణాలను పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా వసూలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో పాస్ మిషన్లను సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటి సారిగా సమాఖ్య ప్రతినిధులకు మిషన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. స్త్రీనిధికి సంబంధించిన రుణాలను బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
స్త్రీనిధి రుణాలు పారదర్శకంగా వసూలు చేయాలి
Advertisement
Advertisement