అక్షరటుడే, కామారెడ్డి: ఇంటింటి సమగ్ర సర్వేలో ఒక్క ఇల్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని వార్డు నంబర్ 44లో సమగ్ర సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి మేరకు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్ రోజుకు 15 నుంచి 20 ఇళ్లల్లో సమాచారాన్ని సేకరించేలా వేగవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, తహశీల్దార్ జనార్దన్, ఇన్ ఛార్జి మున్సిపల్ కమిషనర్ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.