అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం, డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో మహిళల హాజరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీపీవో రాజారాం, డీఆర్డీవో సురేందర్, డీడబ్ల్యూవో బావయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేశ్ బాబు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement