అక్షరటుడే, ఎల్లారెడ్డి : నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆర్డీవో ప్రభాకర్ విచారించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.