అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్యాంప్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని పతాకవిష్కరణ చేశారు. సీఎం కప్ క్రీడల నిర్వహణ కోసం విరాళాలు అందించిన సఫల ఫార్మా ఇండస్ట్రీస్ ఎండీ పైడి ఎల్లారెడ్డి, గాయత్రి షుగర్స్ ఎండీ వేంకటేశ్వరరావును సత్కరించారు. అనంతరం సీఎం కప్ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎఫ్‌వో నిఖిత, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement