అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తయి ఏడాదైన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని కళాయాత్రను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో యాత్ర ప్రచార వాహనంను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనలు ఇవ్వనుందని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పథకాలపై ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్ వో పద్మశ్రీ, కళాకారుల బృందం పాల్గొన్నారు.