అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేలా నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఉపాధ్యాయులకు సూచించారు. రుద్రూర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్న పాఠశాలతో పాటు పీహెచ్‌సీని శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్‌ తరగతుల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రుద్రూర్‌ పీహెచ్‌సీని సందర్శించారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. గడిచిన నెలన్నర రోజులుగా నమోదై డెంగీ కేసుల వివరాలను ఆరా తీశారు. అలాగే సీజనల్‌ వ్యాధుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టర్‌ వెంట సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీరాజ్‌ ఈఈ శంకర్‌ తదితరులున్నారు.