అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని శివాజీనగర్ ప్రభుత్వ బాలుర, బాలికల ఐటీఐ ప్రాంగణాలలో నిర్మిస్తున్న ఏటీసీ భవనం పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. నిజామాబాద్, బోధన్, కమ్మర్‌పల్లి ఏటీసీలలో ప్రవేశాలు చేపట్టనున్నందున భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు.