అక్షరటుడే, ఇందూరు: ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేసిన అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సీపీవో మల్లికార్జున్, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.