అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: గుర్తుతెలియని వాహనాలు ఢీకొన్న సంఘటనల్లో బాధితుల కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆయా డివిజన్ల ఆర్డీవోలతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 32 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయని, 27 సంఘటనల్లో బాధితులను గుర్తించామన్నారు. మరణిస్తే రూ. 2 లక్షలు, గాయపడితే రూ. 50 వేలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ పాల్గొన్నారు.