అక్షరటుడే, ఇందూరు: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం ఇందల్వాయి మండలంలోని ధర్పల్లి, ఎల్లారెడ్డిపల్లిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. సెంటర్లల్లో సమస్యలపై రైతులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరించాలన్నారు. రైతులు ధాన్యం తెస్తే వెంటనే తూకం వేసి లారీల్లో లోడ్ చేయించి రైస్‌మిల్లులకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నీబ్యాగుల కొరత లేదన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం అంబదాస్ రాజేశ్వర్, డీసీవో శ్రీనివాస్ తదితరులున్నారు.