అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : గంజాయి, క్లోరోఫామ్‌, అల్ప్రాజోలం వంటి మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా, వైజాగ్‌, పాడేరు, అరకు నుంచి నిజామాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. 2023తో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది గంజాయి కేసులు కొంత తగ్గాయని సీపీ కల్మేశ్వర్‌ పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ మకరంద్‌, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ, ఆర్టీసీ ఆర్‌.ఎం జానీరెడ్డి తదితరులున్నారు.