అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్, ఇన్ ఛార్జి డీపీవో శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.