అక్షరటుడే, ఇందూరు: ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న ఇంటంటి కుటుంబసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కోరారు. బుధవారం ధర్పల్లి మండలం సీతాయిపేట్‌లో సర్వే తీరును కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో 3,245 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు హౌజ్‌ లిస్టింగ్‌ ప్రక్రియ జరుగుతుందని, 9న సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందన్నారు.