అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: జిల్లాలోని ఆయా చెరువుల్లో ఈ నెల 7వ తేదీ(సోమవారం) నుంచి చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా 2.27 కోట్ల చేప పిల్లలు చెరువులలో వదలడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. వీటిలో 35 నుంచి 40 ఎం.ఎం సైజు గల చేప పిల్లలు 135 లక్షలు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల 91 లక్షల చేప పిల్లలు ఉన్నట్లు తెలిపారు. చేప పిల్లలను వదిలే సమయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సైజు, రకాలలో తేడాలు ఉన్నట్లయితే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.